Tuesday, 5 May 2015

గొంగలి పువ్వు - బహుదళిత - విమలక్క
                                                          ~ విశ్వనాధుల ఫుష్పగిరి.

అనాది పూర్వపు సంతతి
అచ్చుల పోసిన ఇనుము
అచ్చరాలు నేర్సిన సంగతి
వీరభోజ విశ్వకర్ముడి నవీనత్వం
లందల సిద్దులకక్కనెత్తుకున్న బ్రహ్మానికి
ఆవల ఈవల వీరభోగవసంతమై
పూసిన మానవ శ్రమజీవన రక్త పళిమరం

కాల కల్మషం అంటుకున్న
మనిషికి మనిషే దూరంగా వెలివేయబడ్డది
పొలిమెర ఇవుతల - పొలిమెర అవుతల
పొలం గట్టు మీద - వరం కింది బుర్దమల్ల
గర్శెల రాసులు - తవ్వెడు చాటలు

వెలివేతకు అటుగా - ఇటుగా మేమే
అటు ఇటు కాకుండ మాలా మేమే

మాతల్లి మట్టిని సంకటి ముద్దలుగా కలిపి
సనుబాల గంజితో జాతి డొక్కనింపుతున్నది
నేలతల్లి సెమటతో సేదదీరే మా జాతి
ఎప్పుడూ కాళ్ళనే నమ్ముకున్నది
ఆ కాళ్ళు నమ్ముకున్నది ఈ నేలనే

ఆకాసానికి అంగిలేని ఒంటికి నడుమ
కమ్మలగుడిశెలల్లిన సుర్కుడుబద్ద సాచ్చ్యెం
చెప్పుటుంగరం తోలుమడ్తల్ల
తిర్గిన ఆరె జౌడిక జముకుల మోతని
డప్పు శిర్రల పైన జ జజ్జనకాడించ్చింది

మానోట్లే నానిన శియ్యలు
గొర్రెపోడెండ్ల అరలపొట్ట పేగులు
పనికత్తి కట్కెసుర్కత్తి సాముల సారాంశమే

డంగుదిర్గిన సున్నపుసూరు
నెత్తుటి మర్కలంటుకున్న గనేటురాయితో
మొల్సిన ఘడీలకు అల్కుల పట్టెలైనయి

మాడొక్కలంగెల్లిన గడ్డపారలు
ఏడుగోలల లోతుల మంచినీళ్ళైనయి

భూమికి సారెబోసిన మెడమీద భూచక్రమై
తిరిగి కన్నీళ్ళ వతన్లు నాజూకు కూజలైనయి

మూల్గలర్గిన ఉడ్తె మీద సాపిన పోగుల ఆల్లు సాగి
ఆకలి పింజిర్లమీద రక్తవర్ణాల సీరె సాకపోసుకున్నది

సౌడుమట్టిని బట్టపేగులకు మల్లెరేకొల్గేఅత్కి
ఔరేనికుండలమీద అంటిముట్టని వల్లెడైనది

కత్తి కొరిగిన సవురం కట్టడి సానమీద
ఇంటికిరాని ఇత్తులై బైరిగడ్డాల నడుమ ఇగురిచ్చినది

కూట్లకు ముందే చాటల్ల వసంతమాడిన పకుర్తి
మాజాతింటి జల్లెట్ల దాసెన పసుపుతో నీళ్ళాడింది

గీసకత్తి పగటికి మూడు గీతల సార్కలు ఒంటి తాటిమీద
మడ్డిగట్టిన సుర లొట్టిలో రాలిపడ్డ జీవితం పట్వల పొంగిపొర్లింది

మున్నూటర్కల సావుసం మట్టిని ముద్దాడి
మొల్కలైన జివాల రాసులు కుప్పగొట్టి
కుండెడు కుందెన్ల రేల రోకలి పోటుకు శిత్కిపోయి
గొట్టొడ్లబువ్వ రాచిప్పల గొడ్డుకారంతో సరం దిగని ముద్ద
కల్లెడవుతల
కుసుమబియ్యం యేటపోతుల యేపుడుతో
కుత్కెల యేలువట్టని ఇక్కసమై మర్రూడలూపుల
ఈదంబాయి కట్టమీద పొర్లాడింది

జాతి దాట్ల దొర్లిన మోటబొక్కెన నీళ్ళు
దోశిట్ల కషమై దాటి అంగిట్ల సుద్దకట్టువడ్తే
కల్లమౌతల
ఇత్తడి గుర్గిల సల్లయి
పేగుల్ని మత్పరిచ్చింది

జాతి కాయకష్టాన్ని పెడరెక్కల్గ ఇర్సి
బతికున్న పీనిగెల పెయ్యిమీద గూనపెంకలోల్గె పేర్సి
బత్కిసావలేక గడీల
అంగట్ల జాతి కమ్మలగుడ్శెను నింగలాల మీద
బరెంకలు తేలిన ఒళ్ళు
పుట్నాలై ఏగి చీముగుడ్లై చితికిపోయింది

భూమ్మీదవడ్డ ఇత్తనం తొల్సూరి సినుకుకేతడ్శి
కార్తె పదునారకముందే తంగెళ్ళగడ్డమీద
శిబ్బిపూలావనమై పర్సుకున్న బత్కుతీగలు
కొలిమినల్లుకొని డాకలిమీది సమ్మెట దరువుతో
కాలిగజ్జెలాటై ఆది-సింధుల సుట్టిర్కమయ్యింది

రేగట్ల కంచెల మేస్తున్న జివాలు
కంచెనే మింగజూస్తున్న ముర్గాల్ని వాసనవట్నయి
జాతి జీవాలు ముర్కవట్టినయి
ఆ జాంతువు కొంగజపం నేర్సిన
నక్క వూలలువెట్టే నాటకి గుంట తోడేలు
జాతి జివాలు పాడిన పాటకు
గుంట తొక్కకు రోమరోమాన పంచకం పుట్టి
తోకపీకుడుగాని కథ యాదిజేసుకుంది

గడీ.. నింగలాన్ని పిడికిట దాయలేవు
గోశిల మూటగట్టలేవు
నిర్భందం ఒక ఇనుప విచారం
కండ్లు మూసుకుంటే కాటిక కాలికంటదు

మల్లోపాలి..
ఇది బహుదళితజనత్వం
జాతి జనుల జీవనతత్వం
మేటేశకాని కోటల మీద ఈటెలిసిరిన సత్తెం
బహువన్నెకాని బహురూప వారసత్వం
వేలగొంతులనుపుక్కిటవట్టి ఆడెకాళ్ళకు సాకవోసిన సంచారి
పాట నేర్సిన గొంగడి పువ్వు ఎర్రపొద్దులమిత్ర విమల

_____________________________________

పాత గోడల గడీలకు కొత్త సున్నాన్నేస్తున్న దొరల సర్కారు మాజాతి గొంతులోని పాటను సర్కారు గడీలల్ల నిర్భందాలపాల్జేసింది. అణిచివేతలకు గురిచేస్తోంది.

*గుంట తొక్క - గుంట నక్క+తోడెండ్ల సంకర పదం..


~ విశ్వనాధుల ఫుష్పగిరి.9666435426

Sunday, 28 December 2014

Vishwanadhula pushpagiri Poem in Namasthe Telangaana news paper, Chelime....

Saturday, 8 February 2014


/** Wonderful Song on Rain **/
Vishwanadhula Pushpagiri - 7729050843..

ఓహో ఆకాశమా "2"
ఆగమేఘాల మీదను కదలమ్మా "ఓహో"
ఓహో ఆకాశమా "2"

పుడమి అంచుల మీద
పురిటి నొప్పుల బాద
కారె కన్నుల దారలు నీవమ్మ
కడలి కెరటం పైన
ప్రళయ తాండవమాడే
జల రాసుల జీవం నీవమ్మ "ఓహో"

పచ్చని పసిరిక మీద
పసిడి గుండెల్లోన
పలికె నాదమె నీవమ్మ
చెట్టు పుట్టల్లోన
నీలి కాంతుల రగిలె
వెచ్చని శ్వాసవు నీవమ్మ "ఓహో"

చినుకు చినుకుల గలిపి
బతుకు దారులు జూపి
ఆకలి బాదలు బాపవమ్మ
మనిషి మనుసులు గలప
తనువు నిలువున కరిగే
ధరణి ఆలన పాలన నీవమ్మ "ఓహో"

నేల గుండెను తడిమి
మానవ చెమటకు తడిసే
శ్రమ జీవుల ప్రాణమె నీవమ్మ
నాగలి సాలుకు నువ్వు
వన్నెల నాట్యలాడె
జీవ దారల దారివి నీవమ్మా "ఓహో"
Black Smith ( Vishwanadhula Pushpagiri - 7729050843)

వాడెప్పుడో శవమయ్యాడు
_______________________

నేలను తొవ్వుతుంటే
కడుపుకు ఆకలి దొరికింది
పలుగుతో కడుపు పల్గజీరితే
కండ్ల చెమ్మల నడుమ నీళ్ళు
దు:ఖమై పారినయి

రాత్రి దుప్పటి కింద
ఒళ్ళు హూనమయ్యి
పుండు నవిసి నవిసి తొడిమ రాలుతోంది

సుత్తె కొలిమిల తలదాసుకుంది
కొలిమికొన ఊపిరి తిత్తుల కడాసం
బూడ్ది కుప్పలై రాలుతోంది

వాడెప్పుడో శవమయ్యాడు
మట్టికుప్పలకింద నిద్రపోతున్నాడు
శిట్టెపు రాళ్ళను ఒంటినిండా పులుముకొని
లోహమండూరం ముద్ద ఇనుముతో సావాసంజేసి
పీనిగెల వాగుల ముడుసుకొని పండుకున్నడు

సటికెం సాము నేర్సిన కాన్నుంచి
సావు డప్పులు మోగిందాక మిగిలిందేంది
మున్నూటర్కల్లర్గిన మూల్గల మూల్గులు దప్ప
_________________________________________________
విశ్వనాధుల పుష్పగిరి - 9666067712
(SHE) Poem on women  (Vishwanadhula Pushpagiri - 7729050843)

ఆమె

సమాంతరాలు, సగాలు
త్రిభుజాలు, చతురస్త్రాలు, సుదీర్ఘ చాతుర్యాలు
వీటన్నింటిని కలిపే వ్రుత్తాలు, వృత్తంతాలు

ఏ జీవన ఊహా స్వప్నాల కోసమో
అక్కడ అంతులేని చుక్కలు అమర్చబడ్డాయి
బహుశా.. ఆమె విశ్వాన్ని వశపరుచుకున్న వనిత కావొచ్చు
నక్షత్ర మండలాన్ని నాసికాగ్రాన దరించిన నారి కావొచ్చు

ప్రకృతి స్త్రీ
పుడమి స్త్రీ
నింగి కూడానేమో

అందుకేనేమో ఈ పాలపుంతల ఆవిష్కృతాలు
ఎంత లావన్యం
మరెంత మనొహరం

ఉరుములు మెరుపులు ఊపిరి నిట్టూర్పులేమో
జీవ కారుణ్యాన్ని జాగ్రుతపరిచే
ఆశా శ్వాసల ఆశ్వాసాలేమో
రాలే తారలన్నీ ఆమె పాదపూజకు కావొచ్చు
ఆ కళ్ళ తెరలు వాలినపుడు
సూర్యచంద్రులు తెరమరుగవుతారు
ఆమె అమ్మ
"ఆమె" లోనే అనంత సృష్టి ఉద్భవించిందేమో...

-Vishwanadhula pushpagiri
sep-8-12


Anarchism Poem  - Vishwanadhula Pushpagiri (7729050843)

ముక్కు మూసుకొని
మౌనపు నిర్ణిద్రా మూసలో
కరుగుతున్న జడపధార్ధాన్ని...

వాడు.. వీడు..
కుంచెడు కారిన మాటల్తో
కొలిమిలో నాపై కుల పర్వతాలు బలాత్కారం చేసినప్పుడల్లా
జీర్నించుకుపోయిన జందెపు పోగుల వరసల్లో
చిక్కిన నల్లి పేగుల దొబ్బ కార్జాన్ని..

అబ్బ.. అబ్బల గన్న అబ్బ... అబ్బబ్బ

సృష్టి ఆదిని కామించిన వాడెవ్వడురా ?
కామికను రాసలీలలాడించినదెవ్వతిరా ?
రాసలీలల రసాల్ని మోహించి నవ రసాల్లొ ముంచిన వాడెవ్వడురా..?

రారా నా మొగాడా!
మతగ్రంధాల తోడుగా మూసిలో శుచినయ్యా
నా పంచేంద్రియాలను పెకిలించి
పతనమయ్యిన పచ్చినెత్తుటి పాలస్తిని చీల్చి లోపల ()తత్వముందో చూడరా..
రా.. కదలిరా