Saturday, 8 February 2014

Black Smith ( Vishwanadhula Pushpagiri - 7729050843)

వాడెప్పుడో శవమయ్యాడు
_______________________

నేలను తొవ్వుతుంటే
కడుపుకు ఆకలి దొరికింది
పలుగుతో కడుపు పల్గజీరితే
కండ్ల చెమ్మల నడుమ నీళ్ళు
దు:ఖమై పారినయి

రాత్రి దుప్పటి కింద
ఒళ్ళు హూనమయ్యి
పుండు నవిసి నవిసి తొడిమ రాలుతోంది

సుత్తె కొలిమిల తలదాసుకుంది
కొలిమికొన ఊపిరి తిత్తుల కడాసం
బూడ్ది కుప్పలై రాలుతోంది

వాడెప్పుడో శవమయ్యాడు
మట్టికుప్పలకింద నిద్రపోతున్నాడు
శిట్టెపు రాళ్ళను ఒంటినిండా పులుముకొని
లోహమండూరం ముద్ద ఇనుముతో సావాసంజేసి
పీనిగెల వాగుల ముడుసుకొని పండుకున్నడు

సటికెం సాము నేర్సిన కాన్నుంచి
సావు డప్పులు మోగిందాక మిగిలిందేంది
మున్నూటర్కల్లర్గిన మూల్గల మూల్గులు దప్ప
_________________________________________________
విశ్వనాధుల పుష్పగిరి - 9666067712

No comments:

Post a Comment