Saturday, 8 February 2014

(SHE) Poem on women  (Vishwanadhula Pushpagiri - 7729050843)

ఆమె

సమాంతరాలు, సగాలు
త్రిభుజాలు, చతురస్త్రాలు, సుదీర్ఘ చాతుర్యాలు
వీటన్నింటిని కలిపే వ్రుత్తాలు, వృత్తంతాలు

ఏ జీవన ఊహా స్వప్నాల కోసమో
అక్కడ అంతులేని చుక్కలు అమర్చబడ్డాయి
బహుశా.. ఆమె విశ్వాన్ని వశపరుచుకున్న వనిత కావొచ్చు
నక్షత్ర మండలాన్ని నాసికాగ్రాన దరించిన నారి కావొచ్చు

ప్రకృతి స్త్రీ
పుడమి స్త్రీ
నింగి కూడానేమో

అందుకేనేమో ఈ పాలపుంతల ఆవిష్కృతాలు
ఎంత లావన్యం
మరెంత మనొహరం

ఉరుములు మెరుపులు ఊపిరి నిట్టూర్పులేమో
జీవ కారుణ్యాన్ని జాగ్రుతపరిచే
ఆశా శ్వాసల ఆశ్వాసాలేమో
రాలే తారలన్నీ ఆమె పాదపూజకు కావొచ్చు
ఆ కళ్ళ తెరలు వాలినపుడు
సూర్యచంద్రులు తెరమరుగవుతారు
ఆమె అమ్మ
"ఆమె" లోనే అనంత సృష్టి ఉద్భవించిందేమో...

-Vishwanadhula pushpagiri
sep-8-12

No comments:

Post a Comment