Anarchism Poem - Vishwanadhula Pushpagiri (7729050843)
ముక్కు
మూసుకొని
మౌనపు
నిర్ణిద్రా మూసలో
కరుగుతున్న
జడపధార్ధాన్ని...
వాడు..
వీడు..
కుంచెడు
కారిన మాటల్తో
కొలిమిలో
నాపై కుల పర్వతాలు బలాత్కారం
చేసినప్పుడల్లా
జీర్నించుకుపోయిన
జందెపు పోగుల వరసల్లో
చిక్కిన
నల్లి పేగుల దొబ్బ కార్జాన్ని..
అబ్బ..
అబ్బల గన్న అబ్బ... అబ్బబ్బ
సృష్టి
ఆదిని కామించిన వాడెవ్వడురా ?
కామికను
రాసలీలలాడించినదెవ్వతిరా
?
రాసలీలల
రసాల్ని మోహించి నవ రసాల్లొ ముంచిన
వాడెవ్వడురా..?
రారా
నా మొగాడా!
మతగ్రంధాల
తోడుగా మూసిలో శుచినయ్యా
నా
పంచేంద్రియాలను పెకిలించి
పతనమయ్యిన
పచ్చినెత్తుటి పాలస్తిని చీల్చి లోపల ఏ(క)తత్వముందో చూడరా..
రా..
కదలిరా
No comments:
Post a Comment