Sunday, 28 December 2014
Saturday, 8 February 2014
/** Wonderful Song on Rain **/
Vishwanadhula Pushpagiri - 7729050843..
ఓహో ఆకాశమా "2"
ఆగమేఘాల మీదను కదలమ్మా "ఓహో"
ఓహో ఆకాశమా "2"
పుడమి అంచుల మీద
పురిటి నొప్పుల బాద
కారె కన్నుల దారలు నీవమ్మ
కడలి కెరటం పైన
ప్రళయ తాండవమాడే
జల రాసుల జీవం నీవమ్మ "ఓహో"
పచ్చని పసిరిక మీద
పసిడి గుండెల్లోన
పలికె నాదమె నీవమ్మ
చెట్టు పుట్టల్లోన
నీలి కాంతుల రగిలె
వెచ్చని శ్వాసవు నీవమ్మ "ఓహో"
చినుకు చినుకుల గలిపి
బతుకు దారులు జూపి
ఆకలి బాదలు బాపవమ్మ
మనిషి మనుసులు గలప
తనువు నిలువున కరిగే
ధరణి ఆలన పాలన నీవమ్మ "ఓహో"
నేల గుండెను తడిమి
మానవ చెమటకు తడిసే
శ్రమ జీవుల ప్రాణమె నీవమ్మ
నాగలి సాలుకు నువ్వు
వన్నెల నాట్యలాడె
జీవ దారల దారివి నీవమ్మా "ఓహో"
Vishwanadhula Pushpagiri - 7729050843..
ఓహో ఆకాశమా "2"
ఆగమేఘాల మీదను కదలమ్మా "ఓహో"
ఓహో ఆకాశమా "2"
పుడమి అంచుల మీద
పురిటి నొప్పుల బాద
కారె కన్నుల దారలు నీవమ్మ
కడలి కెరటం పైన
ప్రళయ తాండవమాడే
జల రాసుల జీవం నీవమ్మ "ఓహో"
పచ్చని పసిరిక మీద
పసిడి గుండెల్లోన
పలికె నాదమె నీవమ్మ
చెట్టు పుట్టల్లోన
నీలి కాంతుల రగిలె
వెచ్చని శ్వాసవు నీవమ్మ "ఓహో"
చినుకు చినుకుల గలిపి
బతుకు దారులు జూపి
ఆకలి బాదలు బాపవమ్మ
మనిషి మనుసులు గలప
తనువు నిలువున కరిగే
ధరణి ఆలన పాలన నీవమ్మ "ఓహో"
నేల గుండెను తడిమి
మానవ చెమటకు తడిసే
శ్రమ జీవుల ప్రాణమె నీవమ్మ
నాగలి సాలుకు నువ్వు
వన్నెల నాట్యలాడె
జీవ దారల దారివి నీవమ్మా "ఓహో"
Black Smith ( Vishwanadhula Pushpagiri - 7729050843)
వాడెప్పుడో శవమయ్యాడు
_______________________
నేలను తొవ్వుతుంటే
కడుపుకు ఆకలి దొరికింది
పలుగుతో కడుపు పల్గజీరితే
కండ్ల చెమ్మల నడుమ నీళ్ళు
దు:ఖమై పారినయి
రాత్రి దుప్పటి కింద
ఒళ్ళు హూనమయ్యి
పుండు నవిసి నవిసి తొడిమ రాలుతోంది
సుత్తె కొలిమిల తలదాసుకుంది
కొలిమికొన ఊపిరి తిత్తుల కడాసం
బూడ్ది కుప్పలై రాలుతోంది
వాడెప్పుడో శవమయ్యాడు
మట్టికుప్పలకింద నిద్రపోతున్నాడు
శిట్టెపు రాళ్ళను ఒంటినిండా పులుముకొని
లోహమండూరం ముద్ద ఇనుముతో సావాసంజేసి
పీనిగెల వాగుల ముడుసుకొని పండుకున్నడు
సటికెం సాము నేర్సిన కాన్నుంచి
సావు డప్పులు మోగిందాక మిగిలిందేంది
మున్నూటర్కల్లర్గిన మూల్గల మూల్గులు దప్ప
_________________________________________________
విశ్వనాధుల పుష్పగిరి - 9666067712
వాడెప్పుడో శవమయ్యాడు
_______________________
నేలను తొవ్వుతుంటే
కడుపుకు ఆకలి దొరికింది
పలుగుతో కడుపు పల్గజీరితే
కండ్ల చెమ్మల నడుమ నీళ్ళు
దు:ఖమై పారినయి
రాత్రి దుప్పటి కింద
ఒళ్ళు హూనమయ్యి
పుండు నవిసి నవిసి తొడిమ రాలుతోంది
సుత్తె కొలిమిల తలదాసుకుంది
కొలిమికొన ఊపిరి తిత్తుల కడాసం
బూడ్ది కుప్పలై రాలుతోంది
వాడెప్పుడో శవమయ్యాడు
మట్టికుప్పలకింద నిద్రపోతున్నాడు
శిట్టెపు రాళ్ళను ఒంటినిండా పులుముకొని
లోహమండూరం ముద్ద ఇనుముతో సావాసంజేసి
పీనిగెల వాగుల ముడుసుకొని పండుకున్నడు
సటికెం సాము నేర్సిన కాన్నుంచి
సావు డప్పులు మోగిందాక మిగిలిందేంది
మున్నూటర్కల్లర్గిన మూల్గల మూల్గులు దప్ప
______________________________
విశ్వనాధుల పుష్పగిరి - 9666067712
(SHE) Poem on women (Vishwanadhula Pushpagiri - 7729050843)
ఆమె
సమాంతరాలు, సగాలు
త్రిభుజాలు, చతురస్త్రాలు, సుదీర్ఘ చాతుర్యాలు
వీటన్నింటిని కలిపే వ్రుత్తాలు, వృత్తంతాలు
ఏ జీవన ఊహా స్వప్నాల కోసమో
అక్కడ అంతులేని చుక్కలు అమర్చబడ్డాయి
బహుశా.. ఆమె విశ్వాన్ని వశపరుచుకున్న వనిత కావొచ్చు
నక్షత్ర మండలాన్ని నాసికాగ్రాన దరించిన నారి కావొచ్చు
ప్రకృతి స్త్రీ
పుడమి స్త్రీ
నింగి కూడానేమో
అందుకేనేమో ఈ పాలపుంతల ఆవిష్కృతాలు
ఎంత లావన్యం
మరెంత మనొహరం
ఉరుములు మెరుపులు ఊపిరి నిట్టూర్పులేమో
జీవ కారుణ్యాన్ని జాగ్రుతపరిచే
ఆశా శ్వాసల ఆశ్వాసాలేమో
రాలే తారలన్నీ ఆమె పాదపూజకు కావొచ్చు
ఆ కళ్ళ తెరలు వాలినపుడు
సూర్యచంద్రులు తెరమరుగవుతారు
ఆమె అమ్మ
"ఆమె" లోనే అనంత సృష్టి ఉద్భవించిందేమో...
-Vishwanadhula pushpagiri
sep-8-12
ఆమె
సమాంతరాలు, సగాలు
త్రిభుజాలు, చతురస్త్రాలు, సుదీర్ఘ చాతుర్యాలు
వీటన్నింటిని కలిపే వ్రుత్తాలు, వృత్తంతాలు
ఏ జీవన ఊహా స్వప్నాల కోసమో
అక్కడ అంతులేని చుక్కలు అమర్చబడ్డాయి
బహుశా.. ఆమె విశ్వాన్ని వశపరుచుకున్న వనిత కావొచ్చు
నక్షత్ర మండలాన్ని నాసికాగ్రాన దరించిన నారి కావొచ్చు
ప్రకృతి స్త్రీ
పుడమి స్త్రీ
నింగి కూడానేమో
అందుకేనేమో ఈ పాలపుంతల ఆవిష్కృతాలు
ఎంత లావన్యం
మరెంత మనొహరం
ఉరుములు మెరుపులు ఊపిరి నిట్టూర్పులేమో
జీవ కారుణ్యాన్ని జాగ్రుతపరిచే
ఆశా శ్వాసల ఆశ్వాసాలేమో
రాలే తారలన్నీ ఆమె పాదపూజకు కావొచ్చు
ఆ కళ్ళ తెరలు వాలినపుడు
సూర్యచంద్రులు తెరమరుగవుతారు
ఆమె అమ్మ
"ఆమె" లోనే అనంత సృష్టి ఉద్భవించిందేమో...
-Vishwanadhula pushpagiri
sep-8-12
Anarchism Poem - Vishwanadhula Pushpagiri (7729050843)
ముక్కు
మూసుకొని
మౌనపు
నిర్ణిద్రా మూసలో
కరుగుతున్న
జడపధార్ధాన్ని...
వాడు..
వీడు..
కుంచెడు
కారిన మాటల్తో
కొలిమిలో
నాపై కుల పర్వతాలు బలాత్కారం
చేసినప్పుడల్లా
జీర్నించుకుపోయిన
జందెపు పోగుల వరసల్లో
చిక్కిన
నల్లి పేగుల దొబ్బ కార్జాన్ని..
అబ్బ..
అబ్బల గన్న అబ్బ... అబ్బబ్బ
సృష్టి
ఆదిని కామించిన వాడెవ్వడురా ?
కామికను
రాసలీలలాడించినదెవ్వతిరా
?
రాసలీలల
రసాల్ని మోహించి నవ రసాల్లొ ముంచిన
వాడెవ్వడురా..?
రారా
నా మొగాడా!
మతగ్రంధాల
తోడుగా మూసిలో శుచినయ్యా
నా
పంచేంద్రియాలను పెకిలించి
పతనమయ్యిన
పచ్చినెత్తుటి పాలస్తిని చీల్చి లోపల ఏ(క)తత్వముందో చూడరా..
రా..
కదలిరా
Song on Bayyaram Mines ( Vishwanadhula Pushpagiri)
బయ్యరం
బట్టబయలయ్యిందయ్యో
బయ్యరం
బట్టబయలయ్యిందయ్యో
బయ్యరం
బట్టబయలయ్యిందయ్యో
గిరిజనుల
నెత్తురు
పీల్చి
అడవితల్లిని
ఆగంచేసే
బయ్యరం
బట్టబయలయ్యిందయ్యో
||బయ్యారం||
మొక్కామొక్కాను
నరికి
అడవి
సుక్కాల
తరిమి
ఉక్కు
ముద్దాల
కోసం
ఆదివాసుల
అంతం
కోరే
||బయ్యారం
||
రాతిరికి
రంగును
పులిమి
వేకువకు
వన్నెలద్ది
||2||
వాగు
వంకల
మీద ఒఓఒఓ..
ఏటి
గట్టూలమీద
ఆఆఅఆ..
ఎర్ర
కోయిల
పాట
గోండూల
గుండెల
నడుమ
జమిలి
పోరు
బాట
అల్లిన
నెమిలి
ఆట
||బయ్యారం||
పోరు
పాదాల
కడిగి
రణముకు
రవుతానిచ్చి
||2||
నెర్రెలిడిసిన
నేల
కడుపు
కోతల్ల
కమిలి
విల్లమ్ములెత్తమంది
ఆఆఅఆ...
వీరుల
రమ్మంటుంది
ఓఓఒఓ...
సావైన
రేవైన
అగ్గిపూల
దారి
తెలంగాణ
కాపాడ
కదలి
రమ్మంటోంది
సావైన
రేవైన
కదలి
రమ్మంటోంది
తెలంగాణ
కాపాడ
వీరుల
లెమ్మంటుంది
||బయ్యారం||
" బయ్యరం ఉక్కు-ఆదివాసుల
హక్కు
" తెలంగాణ
తల్లి
తన గుండెల్ని
తనే చీల్చుకొని
తన బిడ్డల్ల
బతుకుల్లో
వెలుగులు
నింపే
త్యాగం.
ఉక్కును
మెక్కాలనుకునే
ఆంద్రా
నక్కల
అక్రమాన్ని
వీర తెలంగాణ
సహించదు.
హెచ్చరిక..
అడవి
నిశ్శబ్ధంగా
ఉన్నంతవరకే
మీ ఆటలు..
~ విశ్వనాధుల
పుష్పగిరి
7729050843
Vishwanadhula Pushpagiri - 7729050843
కన్నీళ్ళు కారీ కారీ ఇంకి
నాలో రక్తాశ్రువులుగా జ్వలిస్తూనే ఉన్నాయి
హృదయం ద్రవించుకపోయింది
కడుపులో కత్తులు దిగుతున్నాయి
కపాలం కకావికలమయి శుష్కవనాల్ని వెదుకుతోంది
నేనింకా మంద్ర శరత్ జ్యోత్స్నా కిరణ తరంగాలలో కంపిస్తూనే ఉన్నాను
__________
నేనింత కాలం.. నేనెంత కాలం..
పుట్టిన పుడమిపై పూడిపోయే తనువు
పుడకల్లో కాలిపోయే తనువు
విధి విసిరిన విగతాత్మను
నేనింత కాలం.. నేనెంత కాలం..
___________
అయ్యయ్యో
పుష్పాలికావనమా.. జీవనాంతరంగ రణమా..
వరసుక్షుభిత జీవన్మరణమా..
నేనెంత కాలం..
ఊహల ఉయ్యాలల ఊగిసలాటకు
తామసతృష్ణ కెరటాలపై నేనెంత కాలం..
____________
నేనింత కాలం
మన్నులో, మిన్నులో, నీలో,
నువ్వొదిలిన పచ్చబొట్టులా
నాలో నేనుగా కొంత కాలం..
____________
- అనంత దు:ఖాల వినూత్న సంగమంలో కవితాహాలికపాలితుడు
విశ్వనాధుల పుష్పగిరి..
కన్నీళ్ళు కారీ కారీ ఇంకి
నాలో రక్తాశ్రువులుగా జ్వలిస్తూనే ఉన్నాయి
హృదయం ద్రవించుకపోయింది
కడుపులో కత్తులు దిగుతున్నాయి
కపాలం కకావికలమయి శుష్కవనాల్ని వెదుకుతోంది
నేనింకా మంద్ర శరత్ జ్యోత్స్నా కిరణ తరంగాలలో కంపిస్తూనే ఉన్నాను
__________
నేనింత కాలం.. నేనెంత కాలం..
పుట్టిన పుడమిపై పూడిపోయే తనువు
పుడకల్లో కాలిపోయే తనువు
విధి విసిరిన విగతాత్మను
నేనింత కాలం.. నేనెంత కాలం..
___________
అయ్యయ్యో
పుష్పాలికావనమా.. జీవనాంతరంగ రణమా..
వరసుక్షుభిత జీవన్మరణమా..
నేనెంత కాలం..
ఊహల ఉయ్యాలల ఊగిసలాటకు
తామసతృష్ణ కెరటాలపై నేనెంత కాలం..
____________
నేనింత కాలం
మన్నులో, మిన్నులో, నీలో,
నువ్వొదిలిన పచ్చబొట్టులా
నాలో నేనుగా కొంత కాలం..
____________
- అనంత దు:ఖాల వినూత్న సంగమంలో కవితాహాలికపాలితుడు
విశ్వనాధుల పుష్పగిరి..
Positive life for future generations
" మనం కాని మన లోకం "
హృదయాలన్నీ ఖాళీగా ఉన్నాయి
నిరంతరం ఆర్ధిక అస్తమాతో విరిగిపోతున్నాయి
పర్రయి దేహాలపై కన్నేసి నడి రాతిరిలో నడిచిపోతున్నాయి
వచ్చిన మూలాన్నె మృత్యు కుహరాల్లోకి నెడుతూ అనేకసార్లు మరణిస్తోంది
ఇక టూ-లెట్ బోర్డ్ తగిలించాలేమో , మానవత్వం ఓన్లీ అని...
ఏదో సంకోచం
మరేదో వ్యకోచం
కాలపు పొత్థిల్లు మళ్ళి పునర్జీవితమవ్వాలి
అవి హౄదయాంతరాల్ని దాటి వికసించాలి
నిశ్శభ్ద స్వర సొరంగాల్ని చేదిస్తూ
అత్మీయతవైపు వారదుల్ని నిర్మించాలి
అరచేతుల్ని పెనవేయడం కాదు
ఆత్మా సంయోగాన్ని సాగించాలి
ఆలింగనాలు కాదు
అంతర్ముఖాన్ని ప్రదర్శించాలి
ఎప్పుడూ ప్రశ్నల్ని సంధించడమేనా?
కాసుల భ్రమల్ని దాటి
నేస్తాల కోసం / స్నేహ హస్తాల కోసం షికారు చేద్దాం
ప్రకృతి పాదముద్రల్ని అనుసరిస్తూ
మనం కాని మన లోకంలోకి ప్రయానిద్ధాం
యాంత్రిక వనాల్ని దాటి
మానవత్వపు గుణాల విత్తనాల్ని నాటుదాం
గడియారపు నిమిషాలతో మనకు పనిలేదు
మనం కాలాన్నె జయించాలి
చిరునవ్వుల్ని అస్త్రాలుగా సంధిస్తూ
జీవితం వెన్నుపై సవ్వారీ చెయ్యాలి
కాంక్రీట్ గదుల్లో మనం గడ్డా కట్టుకపోకూడదు
కాలే కడుపులకు పిడికెడు మెతుకులవ్వాలి
స్వేచ్చవిహంగాలమై విశాల గగనాల్ని స్వప్నించాలి
-విశ్వనాధుల పుష్పగిరి
7729050843
" మనం కాని మన లోకం "
హృదయాలన్నీ ఖాళీగా ఉన్నాయి
నిరంతరం ఆర్ధిక అస్తమాతో విరిగిపోతున్నాయి
పర్రయి దేహాలపై కన్నేసి నడి రాతిరిలో నడిచిపోతున్నాయి
వచ్చిన మూలాన్నె మృత్యు కుహరాల్లోకి నెడుతూ అనేకసార్లు మరణిస్తోంది
ఇక టూ-లెట్ బోర్డ్ తగిలించాలేమో , మానవత్వం ఓన్లీ అని...
ఏదో సంకోచం
మరేదో వ్యకోచం
కాలపు పొత్థిల్లు మళ్ళి పునర్జీవితమవ్వాలి
అవి హౄదయాంతరాల్ని దాటి వికసించాలి
నిశ్శభ్ద స్వర సొరంగాల్ని చేదిస్తూ
అత్మీయతవైపు వారదుల్ని నిర్మించాలి
అరచేతుల్ని పెనవేయడం కాదు
ఆత్మా సంయోగాన్ని సాగించాలి
ఆలింగనాలు కాదు
అంతర్ముఖాన్ని ప్రదర్శించాలి
ఎప్పుడూ ప్రశ్నల్ని సంధించడమేనా?
కాసుల భ్రమల్ని దాటి
నేస్తాల కోసం / స్నేహ హస్తాల కోసం షికారు చేద్దాం
ప్రకృతి పాదముద్రల్ని అనుసరిస్తూ
మనం కాని మన లోకంలోకి ప్రయానిద్ధాం
యాంత్రిక వనాల్ని దాటి
మానవత్వపు గుణాల విత్తనాల్ని నాటుదాం
గడియారపు నిమిషాలతో మనకు పనిలేదు
మనం కాలాన్నె జయించాలి
చిరునవ్వుల్ని అస్త్రాలుగా సంధిస్తూ
జీవితం వెన్నుపై సవ్వారీ చెయ్యాలి
కాంక్రీట్ గదుల్లో మనం గడ్డా కట్టుకపోకూడదు
కాలే కడుపులకు పిడికెడు మెతుకులవ్వాలి
స్వేచ్చవిహంగాలమై విశాల గగనాల్ని స్వప్నించాలి
-విశ్వనాధుల పుష్పగిరి
7729050843
- నడి జీవిత నడవడి -
I & Iam
ఇంకా దు:ఖాల కడలి ఒడిలోనే నిద్రిస్తు నిర్భయంగా నిరాధారమైన లోలకంలా నేనూగుతూనే ఉన్నా?
ఉన్నాను..
విప్లవ గీతమై ఉరికంభంపై ఏ రక్తమూ అంటని తామర తుంపరగా
గుట్టలుగా పడి ఉన్న శవాల మద్యలో ఏ వాసనా పట్టని రాబందుగా
వేల పల్లవుల గీతాలపనలపై స్వరాల నిర్నిద్రా నిఘంటువునై ఏ రాగము పలకని తంత్రిగా
ఉన్నాను..
పసిరికలో సారికనై
అభిసారిక నుదిటిన మేలిమి పసిమినై
లాలస గొంతున తీరమెరుగని మోక్ష కామికగా
ఉన్నాను..
భగ్నహృదయ వాంచల్లో నగ్నముగా తేలాడుతూ
సతీ వశమయ్యిన పతి అనురాగపు దరిలా
రవి చూడని తీరాల్లో ఒంటరిగా ఊరేగుతూ
కళ్ళలొ ప్రవహించే ఆనందాశ్రువుల వెంట
కలల కాలాలుగా ప్రయాణిస్తూ
ఉన్నాను..
- Vishwanadhula Pushpagiri
7729050843
I & Iam
ఇంకా దు:ఖాల కడలి ఒడిలోనే నిద్రిస్తు నిర్భయంగా నిరాధారమైన లోలకంలా నేనూగుతూనే ఉన్నా?
ఉన్నాను..
విప్లవ గీతమై ఉరికంభంపై ఏ రక్తమూ అంటని తామర తుంపరగా
గుట్టలుగా పడి ఉన్న శవాల మద్యలో ఏ వాసనా పట్టని రాబందుగా
వేల పల్లవుల గీతాలపనలపై స్వరాల నిర్నిద్రా నిఘంటువునై ఏ రాగము పలకని తంత్రిగా
ఉన్నాను..
పసిరికలో సారికనై
అభిసారిక నుదిటిన మేలిమి పసిమినై
లాలస గొంతున తీరమెరుగని మోక్ష కామికగా
ఉన్నాను..
భగ్నహృదయ వాంచల్లో నగ్నముగా తేలాడుతూ
సతీ వశమయ్యిన పతి అనురాగపు దరిలా
రవి చూడని తీరాల్లో ఒంటరిగా ఊరేగుతూ
కళ్ళలొ ప్రవహించే ఆనందాశ్రువుల వెంట
కలల కాలాలుగా ప్రయాణిస్తూ
ఉన్నాను..
- Vishwanadhula Pushpagiri
7729050843
మన
ఊరిలో (బ్రాహ్మణ వెల్లెంల) బట్టురాజు ల కులానికి చెందిన ఒక వ్యక్తి
ఉండేవాడట. అతని పేరు చెలిమె రాజు. అతను మహా చమత్కారి. మంచి పాండిత్యం
కలిగినవాడు కూడా. అయితే పక్క ఉన్న కొన్ని ఊర్లకు పర్యటన నిమిత్తం
వెల్లాడంట. అయితే మద్యలో ఆకలి వేయడంతో ఒక ఇంటి వద్ద ఆగాడంట. ఆ ఇంట్లోని
వారు అతన్ని చూసి గుర్తించి ఇతనికి ఆకలి వేస్తున్నదని తెలుసుకొని ఇంట్లోకి
వెళ్ళిపోయారట. చాలాసేపటి వరకు రాకపోవడంతో అప్పుడు ఆ బట్టురాజు ఇలా
అన్నాడట...
" బట్టు బట్టెట్ల - తైద రొట్టెట్ల
నువ్వు ఇంట్లెట్ల - నేను బైటెట్ల "
ఆన్నాడంట. దాంతో ఆ ఇంట్లోని వారు పరుగున వచ్చి చెలిమెరాజు ఆకలి తీర్చారంట.
_ Vishwanadhula Pushpagiri
7729050843
" బట్టు బట్టెట్ల - తైద రొట్టెట్ల
నువ్వు ఇంట్లెట్ల - నేను బైటెట్ల "
ఆన్నాడంట. దాంతో ఆ ఇంట్లోని వారు పరుగున వచ్చి చెలిమెరాజు ఆకలి తీర్చారంట.
_ Vishwanadhula Pushpagiri
7729050843
For Best Communication between father and son...
ఒక రోజు కొడుకు ఎండలో ఇల్లెక్కి పెంకలు సర్దుతున్నడు. తండ్రి కిందనుండి ఎండ కొడుతుంది దిగురా నాయినా అని పిలుస్తున్నడు. కాని కొడుకు ఎహపో నీయమ్మ... నాకేమయితైది ఈ ఎండతోని అంటున్నడు కని దిగుతలేడు. ముసలాయాన తన చిన్ని మనుమన్ని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టాడు. పైనున్న కొడుకు ఆగమేఘాల మీద కిందకొచ్చి నీయమ్మ ఆనికి ఎండగొట్టదు అని ప్రశ్నించిండు. వెంటనె ముసలాయన నీ కొడుకు నీకెంతొ.. నా కొడుకు అంటే నువ్వూ నాకు అంతే... అనంగనే తండ్రీ కొడుకులిద్దరి కండ్లల్ల నీల్లు దిర్గినై.. నాయినంటేందో గయ్యాల అర్దమయ్యింది కొడుక్కు..
- జీవిత సారం..
- విశ్వనాధుల పుష్పగిరి.
7729050843
12-09-2013 - Click...
poem on today
relation between today and tomorrow ..
నిన్నలా లేదు నేడు
నడిరేయిలో వసంత కోయిల దు:ఖం
ఫుంఖాను ఫుంఖాలుగా
కెరటాలై జారిపడి
కన్నీటి అలలై.. జలపాతాలై..
విజృభించినది...
ముక్కలుగా విరిగిపడిన రాత్రిలో
చుక్కల కోసం పరితపిస్తూ
పన్నీటి కొలనులో దిగంభరంగా సంచరిస్తూ
నూరు నూలుపోగుల నారలతో.. నరాలతో..
ముద్దులు ముద్దలుగా తెగవేయబడ్డ నెలవంకని
మేఘాలతో కలిపి కుడుతోంది
అభూత కల్పన
అంతా మిధ్య
చీకటి చితి విదిలిస్తూ వదిలిన శరం..
-Vishwanadhula Pushpagiri
poem on today
relation between today and tomorrow ..
నిన్నలా లేదు నేడు
నడిరేయిలో వసంత కోయిల దు:ఖం
ఫుంఖాను ఫుంఖాలుగా
కెరటాలై జారిపడి
కన్నీటి అలలై.. జలపాతాలై..
విజృభించినది...
ముక్కలుగా విరిగిపడిన రాత్రిలో
చుక్కల కోసం పరితపిస్తూ
పన్నీటి కొలనులో దిగంభరంగా సంచరిస్తూ
నూరు నూలుపోగుల నారలతో.. నరాలతో..
ముద్దులు ముద్దలుగా తెగవేయబడ్డ నెలవంకని
మేఘాలతో కలిపి కుడుతోంది
అభూత కల్పన
అంతా మిధ్య
చీకటి చితి విదిలిస్తూ వదిలిన శరం..
-Vishwanadhula Pushpagiri
Subscribe to:
Posts (Atom)