Saturday, 8 February 2014

Vishwanadhula Pushpagiri - 7729050843


కన్నీళ్ళు కారీ కారీ ఇంకి
నాలో రక్తాశ్రువులుగా జ్వలిస్తూనే ఉన్నాయి
హృదయం ద్రవించుకపోయింది
కడుపులో కత్తులు దిగుతున్నాయి
కపాలం కకావికలమయి శుష్కవనాల్ని వెదుకుతోంది
నేనింకా మంద్ర శరత్ జ్యోత్స్నా కిరణ తరంగాలలో కంపిస్తూనే ఉన్నాను

__________

నేనింత కాలం.. నేనెంత కాలం..
పుట్టిన పుడమిపై పూడిపోయే తనువు
పుడకల్లో కాలిపోయే తనువు
విధి విసిరిన విగతాత్మను
నేనింత కాలం.. నేనెంత కాలం..

___________

అయ్యయ్యో
పుష్పాలికావనమా.. జీవనాంతరంగ రణమా..
వరసుక్షుభిత జీవన్మరణమా..
నేనెంత కాలం..
ఊహల ఉయ్యాలల ఊగిసలాటకు
తామసతృష్ణ కెరటాలపై నేనెంత కాలం..

____________

నేనింత కాలం
మన్నులో, మిన్నులో, నీలో,
నువ్వొదిలిన పచ్చబొట్టులా
నాలో నేనుగా కొంత కాలం..

____________

- అనంత దు:ఖాల వినూత్న సంగమంలో కవితాహాలికపాలితుడు
విశ్వనాధుల పుష్పగిరి..

No comments:

Post a Comment