For Best Communication between father and son...
ఒక రోజు కొడుకు ఎండలో ఇల్లెక్కి పెంకలు సర్దుతున్నడు. తండ్రి కిందనుండి ఎండ కొడుతుంది దిగురా నాయినా అని పిలుస్తున్నడు. కాని కొడుకు ఎహపో నీయమ్మ... నాకేమయితైది ఈ ఎండతోని అంటున్నడు కని దిగుతలేడు. ముసలాయాన తన చిన్ని మనుమన్ని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టాడు. పైనున్న కొడుకు ఆగమేఘాల మీద కిందకొచ్చి నీయమ్మ ఆనికి ఎండగొట్టదు అని ప్రశ్నించిండు. వెంటనె ముసలాయన నీ కొడుకు నీకెంతొ.. నా కొడుకు అంటే నువ్వూ నాకు అంతే... అనంగనే తండ్రీ కొడుకులిద్దరి కండ్లల్ల నీల్లు దిర్గినై.. నాయినంటేందో గయ్యాల అర్దమయ్యింది కొడుక్కు..
- జీవిత సారం..
- విశ్వనాధుల పుష్పగిరి.
7729050843
No comments:
Post a Comment