Saturday, 8 February 2014

- నడి జీవిత నడవడి -
I & Iam



 ఇంకా దు:ఖాల కడలి ఒడిలోనే నిద్రిస్తు నిర్భయంగా నిరాధారమైన లోలకంలా నేనూగుతూనే ఉన్నా?
ఉన్నాను..

విప్లవ గీతమై ఉరికంభంపై ఏ రక్తమూ అంటని తామర తుంపరగా
గుట్టలుగా పడి ఉన్న శవాల మద్యలో ఏ వాసనా పట్టని రాబందుగా
వేల పల్లవుల గీతాలపనలపై స్వరాల నిర్నిద్రా నిఘంటువునై ఏ రాగము పలకని తంత్రిగా
ఉన్నాను..

పసిరికలో సారికనై
అభిసారిక నుదిటిన మేలిమి పసిమినై
లాలస గొంతున తీరమెరుగని మోక్ష కామికగా
ఉన్నాను..

భగ్నహృదయ వాంచల్లో నగ్నముగా తేలాడుతూ
సతీ వశమయ్యిన పతి అనురాగపు దరిలా
రవి చూడని తీరాల్లో ఒంటరిగా ఊరేగుతూ
కళ్ళలొ ప్రవహించే ఆనందాశ్రువుల వెంట
కలల కాలాలుగా ప్రయాణిస్తూ
ఉన్నాను..


- Vishwanadhula Pushpagiri
  7729050843

No comments:

Post a Comment