Saturday, 8 February 2014

Positive life  for future generations


" మనం కాని మన లోకం "

హృదయాలన్నీ ఖాళీగా ఉన్నాయి
నిరంతరం ఆర్ధిక అస్తమాతో విరిగిపోతున్నాయి
పర్రయి దేహాలపై కన్నేసి నడి రాతిరిలో నడిచిపోతున్నాయి
వచ్చిన మూలాన్నె మృత్యు కుహరాల్లోకి నెడుతూ అనేకసార్లు మరణిస్తోంది
ఇక టూ-లెట్ బోర్డ్ తగిలించాలేమో , మానవత్వం ఓన్లీ అని...

ఏదో సంకోచం
మరేదో వ్యకోచం
కాలపు పొత్థిల్లు మళ్ళి పునర్జీవితమవ్వాలి
అవి హౄదయాంతరాల్ని దాటి వికసించాలి
నిశ్శభ్ద స్వర సొరంగాల్ని చేదిస్తూ
అత్మీయతవైపు వారదుల్ని నిర్మించాలి

అరచేతుల్ని పెనవేయడం కాదు
ఆత్మా సంయోగాన్ని సాగించాలి
ఆలింగనాలు కాదు
అంతర్ముఖాన్ని ప్రదర్శించాలి

ఎప్పుడూ ప్రశ్నల్ని సంధించడమేనా?
కాసుల భ్రమల్ని దాటి
నేస్తాల కోసం / స్నేహ హస్తాల కోసం షికారు చేద్దాం
ప్రకృతి పాదముద్రల్ని అనుసరిస్తూ
మనం కాని మన లోకంలోకి ప్రయానిద్ధాం
యాంత్రిక వనాల్ని దాటి
మానవత్వపు గుణాల విత్తనాల్ని నాటుదాం

గడియారపు నిమిషాలతో మనకు పనిలేదు
మనం కాలాన్నె జయించాలి
చిరునవ్వుల్ని అస్త్రాలుగా సంధిస్తూ
జీవితం వెన్నుపై సవ్వారీ చెయ్యాలి
కాంక్రీట్ గదుల్లో మనం గడ్డా కట్టుకపోకూడదు
కాలే కడుపులకు పిడికెడు మెతుకులవ్వాలి
స్వేచ్చవిహంగాలమై విశాల గగనాల్ని స్వప్నించాలి

-విశ్వనాధుల పుష్పగిరి

7729050843

No comments:

Post a Comment